Amsterdam: రన్నింగ్‌ విమానం ఇంజిన్‌లోకి వెళ్లాడు

0
179

ఆమ్‌స్టర్‌డామ్‌: ఓ వ్యక్తి రన్నింగ్‌ విమానం ఇంజిన్‌లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయరంలో చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని డచ్‌ ఫ్లాగ్‌షిప్‌ క్యారియర్‌ కేఎల్‌ఎం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు డెన్మార్క్‌లోని బిలుండ్‌కి విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను దింపి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు మృతి చెందిన వ్యక్తికి సంస్థ సంతాపం తెలిపింది. ఇదిలాఉంటే ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ప్రయాణికుడా లేక ఉద్యోగి అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here