డ్రా దిశగా యాషెస్‌ నాలుగో టెస్టు

0
7

– రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 214/5
– నాలుగో రోజు ముగిసిన ఆట
మంచెస్టర్‌: ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న యాషెస్‌ నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

మర్నస్‌ లబుషేన్‌ (111) సెంచరీ సాధించాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్‌ మార్ష్‌ (31), కామెరున్‌ గ్రీన్‌ (3) ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆదివారం చివరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆసీస్‌ మిగతా ఐదు వికెట్లు వెనువెంటనే కోల్పోతే.. లక్ష్య ఛేదన స్వల్పంగా ఉంటే ఇంగ్లాండ్‌ గెలిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌, ఇంగ్లాండ్‌ 2-2తో సమంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here