డ్రాగా ముగిసిన ఇంగ్లాండ్‌-ఆసీస్‌ నాలుగో టెస్టు

0
7

మంచెస్టర్‌: ఇంగ్లాండ్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 214/5 వద్ద ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక ఐదో రోజైన ఆదివారం కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవలనుకున్నా ఇంగ్లాండ్ ఆశలు గల్లంతయ్యాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జాక్‌ క్రాలీకి దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ టెస్టు సిరీస్‌ ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here