కాంగ్రెస్‌ శ్వేతపత్రం సత్యదూరం

0
67

మాజీ మంత్రి హరీశ్‌రావు

అసెంబ్లీలో ఇరిగేషన్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ సభలో ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అంతకాకుండా ఈ పుస్తకంలో ఆరు అబద్ధాలు ఉన్నాయని, వాటిని సభలో వివరించారు.

అబద్ధం1
మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిందా.. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేం వచ్చాక రూ.775 కోట్ల ఖర్చుతో పూర్తిచేసి నీళ్లు ఇచ్చాం.

అబద్ధం2
ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు.

అబద్ధం3
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేం కేంద్రానికి పిర్యాదు చేయలేదు అన్నారు. అది తప్పు. 5- 5- 2020 నాడు జీఓ వచ్చింది. అయితే జనవరి లోనే మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం.

అబద్ధం4
కేఆర్‌ఎంబీ కి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేం సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు కూడా తప్పే. మేం వ్యతిరేకిస్తూ అలెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాం.

అబద్ధం5
కేఆర్‌ఎంబీ కి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాం. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది.

అబద్ధం6
50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరాం. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here