కుక్కకు బొక్క దొరికినట్లే బీఆర్ఎస్ నాయకుల తీరు

0
2

దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్సే
– రేవంత్‌ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వక్రీకరిస్తుంది
– కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క

ప్రజానావ/ములుగు ప్రతినిధి: దేశంలో రైతులకు తొలిసారి ఉచితంగా కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యాలను బీఆర్‌ఎస్‌ పార్టీ వక్రీకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్రంలో కొనే దిక్కు లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా సీతక్క గుర్తుచేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీనేనన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కుక్కకు బొక్క దొరికినట్లు అమెరికా లో రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు.. నాణ్యమైన 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుంది అని అంటే మా నాయకుడి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here