భారత్‌దే టెస్ట్‌ సిరీస్‌

0
44
  • రెండో టెస్ట్‌ డ్రా
  • చివరి రోజు వర్షం
  • రద్దయినట్లు ప్రకటించిన అంపైర్లు
    ట్రినిడాడ్‌: భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి రోజైన సోమవారం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. కెప్టెణ్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (28), తగెనరైన్‌ చంద్రపాల్‌ (24, నాటౌట్‌), కిర్క్‌ మెకంజీ (0), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (20, నాటౌట్‌)గా ఉన్నారు. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు తగ్గాయి. ఇదిలాఉంటే భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్‌ కాగా, విరాట్‌ కోహ్లీ (121) సెంచరీతో పాటు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (57), రోహిత్‌ శర్మ (80), రవీంద్ర జడేజా (61), అశ్విన్‌ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్‌ భారత బౌలర్ల ధాటికి 255 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ సిరాజ్‌ 5 వికెట్లు పడగొట్టగా, ముకేశ్‌ కుమార్‌, జడేజాలు రెండేసి వికెట్లు, అశ్విన్‌కు ఒక వికెట్‌ తీశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌ అందుకున్నాడు. కాగా, ఇరుజట్ల మధ్య జులై 27 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌ ఆగస్టు 1న ముగుస్తుండగా, 3వ తేదీ నుంచి భారత్‌- వెస్టిండీస్‌ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here