తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా పిల్లి మధు

0
1

నియామక పత్రాన్ని అందజేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా. బండప్రకాశ్‌ ముదిరాజ్
తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా వేములవాడకు చెందిన న్యాయవాది పిల్లి మధు నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘట్‌ చంద్రగార్డెన్స్‌లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా.బండ ప్రకాశ్‌ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకమైన న్యాయవాది పిల్లి మధుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here