మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

0
24

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. అంతకుముందు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ పదవీకాలం 2012, జూన్ 3న పూర్తైంది. అప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు బండా ప్రకాశ్ శనివారం నామినేషన్ వేశారు. ఆదివారం బండ ప్రకాశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here