శెభాష్‌.. నిఖత్‌

0
5

– మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ప్రీ క్వార్టర్స్ కు
– ఆఫ్రికన్ క్రీడాకారిణి రౌమైసాపై అద్భుత విజయం
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ప్రీ-క్వార్టర్స్ మ్యాచ్ లో ఆడేందుకు అర్హత సాధించింది. ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 50 కేజీల ఈవెంట్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో తలపడిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 5-0తో ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ఫైనల్ బెర్తు ను ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో నిఖత్‌కు ఇది రెండో విజయం. ఇదిలాఉంటే మ్యాచ్‌లో ప్రత్యర్థి రౌమైసా కూడా ముందుకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించగా నిఖత్ పంచ్ లతో ఆమెను ఆలౌడ్ చేసింది. అనంతరం తరువాత రౌండ్ ను అంపైర్లు ప్రారంభించారు. ఈ ఆటలో ఇద్దరు బాక్సర్లు ఎంతో దూకుడుగా ఆడారు. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నా, చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి నిఖత్ జరీన్ విజయం సాధించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here