టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు

0
15

– మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు
– డిసెంబర్‌ 10 నుంచి జనవరి 3 వరకు సిరీస్‌లు
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. దాదాపు 28రోజులు పర్యటనలో భాగంగా టీమిండియా సఫారీ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

డిసెంబర్‌ 10న దర్బన్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 12న రెండో టీ20, 14న మూడో టీ20 జరగనుంది. ఇక మూడు రోజుల విరామం అనంతరం డిసెంబర్‌ 17న జోహాన్నెస్‌బర్గ్‌ వేదికగా తొలి వన్డే జరగనుంది. 19న రెండో వన్డే, 21న మూడో వన్డే లో ఈ జట్లు పోటీ పడతాయి. ఇక ఇదే నెల 26న గాంధీ- మండేలా టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా, 2024 జనవరి 3న రెండో టెస్టు కేప్‌టౌన్‌ వేదికగా జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ సిరీస్‌ వివరాలను అధికారికంగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here