తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు

0
8

చివరి వన్డేలోనూ ఓటమి
‘సిరీస్ ఆస్ట్రేలియా వశం

చెన్నై : భారత బౌలర్లు రాణించినా బ్యాటర్లు మరోసారి తేలిపోయారు. దీంతో చివరి వన్డే లొనూ టీంఇండియా ఓటమిపాలై ఆస్ట్రేలియాకు సిరీస్ ను సమర్పించుకుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 2-1 తేడాతో కోల్పోవడం జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49 ఓవర్ లకీ 269 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.

ఓపెనర్ మిచెల్ మార్ష్ అత్యధికంగా 47 పరుగులు చేశారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేయడం జరిగింది. మిగతావాళ్లు పెద్దగా పరుగులు జోడించకపోయిన గాని సమిష్టిగా ఆడి 269 పరుగులు చేయడం జరిగింది. టీమిండియా బౌలర్ లలో హార్దిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 3, మహమ్మద్ సిరాజ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్… బ్యాట్స్ మెన్ లు ప్రారంభం నుండి గెలుపు దిశగా .. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ 17 బంతుల్లో రెండు సిక్సర్ లు, రెండు ఫోర్ లతో 30 పరుగులు చేయగా… అబాట్ బౌలింగ్ లో బౌండ్రి కొట్టాలని ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.

ప్రారంభంలో భారత్ బాగానే పరుగులు చేయగా మధ్యలో.. సూర్య కుమార్ యాదవ్, పాండ్యా, జడేజా వికెట్ల కీలకమైన సమయంలో పడిపోవడంతో భారత్ బ్యాట్స్ మెన్ లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. దీంతో చివరిలో చేతులెత్తేయడంతో మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వెళ్లిపోయింది. భారత్ 49.1 ఓవర్ లలో 248 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఆసీస్ బౌలర్ లలో జంప 4, అగర్ 2 వికెట్లు తీయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here