హర్మన్‌ సేనదే టీ20 సిరీస్‌

0
4

– చివరి టీ20లో బంగ్లాకు ఓదార్పు విజయం
– హర్మన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా మహిళా జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. గురువారం ఢాకా వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న హర్మన్‌ సేనకు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.

టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (40), జెమీమా రోడ్రిగ్స్‌ (28) మాత్రమే రాణించారు. బంగ్లా బౌలర్లలో రబీయా ఖాన్‌ 3 వికెట్లు తీసుకోగా, సుల్తానా ఖాతున్‌ 2, నహీదా అక్తర్‌, ఫాహీమా ఖాతున్‌, షోమా అక్తర్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది.

బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్‌ షమీమా సుల్తానా (42) రాణించింది. టీమిండియా బౌలర్లలో మిన్ను మణి, దేవిక వైద్య రెండేసి వికెట్లు పడగొట్టగా, జెమీమా ఒక వికెట్‌ తీసింది. దీంతో బంగ్లాదేశ్‌ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీమా సుల్తానా దక్కించుకోగా, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ గెలుచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here