ఆసియాన్‌ గేమ్స్‌కు టీమిండియా జట్ల ప్రకటన

0
4

చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరిగే 19వ ఆసియాన్‌ గేమ్స్‌ 2022కు బీసీసీఐ టీమిండియా సీనియర్‌ మహిళా, సీనియర్‌ పురుషుల జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ క్రీడలు 2022లోనే జరగాల్సి ఉన్నా కొవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ క్రీడలను సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే క్రికెట్‌కు భారత జట్ల వివరాలను బీసీసీఐ ప్రకటించింది.

సీనియర్‌ మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మచ, రీచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌, దేవికా వైద్య, అంజలి సర్వాని, టిటాస్‌ సాధు, రాజేశ్వరి గైక్వాడ్‌, మిన్ను మణి, కనికా ఆహుజా, ఉమా ఛెత్రి (వికెట్‌ కీపర్‌), అనూష బారెడ్డి.
స్టాండ్‌ బై ప్లేయర్లు: హర్లీన్‌ డియోల్‌, కశ్వీ గౌతమ్‌, స్నేహ్‌ రాణా, సైకా ఇషాక్‌, పూజా వస్త్రాకార్‌.

సీనియర్‌ పురుషుల జట్టు : రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, షెహబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయి, ఆవేశ్‌ ఖాన్‌, హర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, శివమ్‌ దూబే, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: యాష్‌ ఠాకూర్‌, సాయి కిషోర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సాయి సుదర్శన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here