మళ్లీ ఓడిన టీమిండియా

0
22

– రెండో వన్డేలోనూ విండీస్‌ విజయం
– చెతులెత్తేసిన భారత బ్యాటర్లు
గయానా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి పరాజయం మూటగట్టుకుంది. గయానా వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్‌ వర్మ (51), ఇషాన్‌ కిషన్‌ (27), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (24) మాత్రమే ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో మెక్‌కాయ్‌, హోల్డర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా, జొసెఫ్‌, మేయర్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 8వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ (67) అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత బౌలర్లలో పాండ్యా మూడు వికెట్లు పడగొట్టగా, చహల్‌ 2, ఆర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. నికోలస్‌ పూరన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు దక్కింది. ఇదిలాఉంటే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్‌ 2-0 తేడాతో ముందంజలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here