అనుమానాస్పదంగా బాలుడి మృతి

0
5

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాకు చెందిన మాలోత్ ఉదయ్ ( 11 ) అనే గిరిజన బాలుడు శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అనుమానాస్పందంగా మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లగా, రాజన్న పేట గ్రామంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న ఉదయ్ ఇంటి వద్దనే ఉండిపోయాడు. తమ ఇంట్లో వంట గది లోకి వెళ్లి గడియపెట్టి లుంగీ తో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఏడు గంటలకు తిరిగి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ప్రశాంత్ , రేణా ఇంటి వద్ద కొడుకు కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు. ఇంటికి వచ్చి వంటగది గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా, గోడకు ఉన్న మొలకు లుంగీతో ఉరి వేసుకుని కొన ఊపిరితో కనిపించాడు. వెంటనే ఉదయన్‌ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయ్ మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు, బంధుమిత్రులు బోరున విలపించారు. ఈ ఘటనపై ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here