శ్రీలంక 312 ఆలౌట్‌

0
6

గాలె: పాకిస్తాన్‌తో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 242/6తో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌ దిగిన లంక జట్టు మరో 70 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్‌ ధనుంజయ డిసిల్వా (122) తన టెస్టు కెరీర్‌లో 10వ సెంచరీ సాధించాడు.

ఇక రెండోరోజు ధనుంజయతో పాటు సదీరా సమర విక్రమ (36), విశ్వ ఫెర్నాండో (21) ఆకట్టుకున్నారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిదీ, నసీమ్‌ షా, అబ్రార్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా, సల్మాన్‌ ఒక వికెట్‌ తీశాడు. పాకిస్తాన్‌ లంచ్‌ తర్వాత తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here