మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

0
88
source twitter (file)

నిజామాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్‌ నుంచి..
21 నుంచి 24 వరకు నడపనున్న రైల్వేశాఖ
కిషన్ రెడ్డి చొరవతో భక్తులకు అందుబాటులోకి

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడాకం సమ్మక్క, సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఈ రైళ్లు సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.

07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్
07014/07015: సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
07019/07020: నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్

‘నరేంద్రమోడీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు జాతర ఏర్పాట్ల కోసం రూ.3కోట్లను కేటాయించింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదిలాబాద్-వరంగల్-ఆదిలాబాద్ మార్గంలోనూ మేడారం భక్తులకోసం ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు ఆదిలాబాద్, అంబారీ, కిన్వట్, ధనోరా, భోకర్, ముద్‌ఖేడ్, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, హసన్‌పర్తి మీదుగా వరంగల్ చేరుకుంటుంది. తిరిగి ఇదేమార్గంలో ఆదిలాబాద్ వెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here