– ఫైనల్‌లో జకోవిచ్‌పై యువ సంచలనం అల్కరాస్ విజయం
వింబుల్డన్‌లో మరో సంచలనం నమోదైంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో స్పెయిన్ బుల్ టాప్‌సీడ్ రెండో సీడ్ జకోవిచ్‌పై 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. దాదాపు 4.42 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్ ఓడినా అల్కరాస్ ఆ తర్వాత వేగంగ పుంజుకొని తొలిసార ట్రోఫీని ముద్దాడాడు. ఈ మ్యాచ్‌లో 20ఏళ్ల అల్కరాస్ 9 ఏఎస్‌లు, 66 విన్నర్లు కొట్టడం విశేషం. ఇదిలాఉంటే ఈ ఏడాదిలో ఇప్పటికే ఆస్ట్రేలియాన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గిన జకోవిచ్‌కు ఈ గ్రాండ్‌స్లామ్‌లో చుక్కెదురైంది.