ఆర్టీసీ తెలంగాణకే గుండెకాయ

0
19

– రాజన్న వద్దకు భక్తులను పూజారి చేరిస్తే పూజారి వద్దకు భక్తులను చేర్చేది ఆర్టీసీయే
– సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది
– ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
తెలంగాణకు ఆర్టీసీ సంస్థ గుండెకాయ వంటిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. గురువారం స్థానిక సంగీత నిలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో పల్లె పల్లెకు ఆర్టీసీ సేవలు అమోఘమని, కార్పొరేషన్ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. భగవంతుడి దర్శనానికి భక్తులను పూజారి చేరిస్తే పూజారి వద్దకు భక్తులను చేర్చేది ఆర్టీసీ వారేనన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడమనేది చాలా సంతోషకరమైన విషయమని, ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వ రాష్ట్రంలోనే మన వేములవాడ డిపో చాలా లాభదాయకంగా ఉందని, లక్షలాది భక్తులను రాజన్న చెంతకు చేరుస్తున్నారన్నారు. శివరాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆర్టీసీ మంచి సేవలు అందిస్తుందన్నారు. ఉచిత బస్సులు నిర్వహించడం ఆది, సోమవారాల్లో ఉచితంగా బస్టాండ్ నుంచి దేవాలయం వరకు భక్తులకు రవాణా సౌకర్యం అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here