బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సోమవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు ఈ నెల 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు మాత్రం ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు అధికారులు. ఆరేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేయనున్నారు. 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు మే 31 నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉండగా, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు వీసీ సతీశ్‌కుమార్ తెలిపారు.