AADHI SRINIVAS | శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపన

0
135

మేడిపల్లి, ప్రజానావ: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్‌ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్చ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆది శ్రీనివాస్‌కు భాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభ స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here