బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేందుకు కుట్ర

0
8

రావుల శ్రీధర్‌ రెడ్డి

కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp) పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ (brs) ను బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం ఆయన తెలంగాణ భవనల్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ (kcr) ప్రభుత్వ పనితీరు బాగుందని గతంలో మోడీ అనలేదా.. మిషన్ భగీరథపై మోడీ ప్రసంశలు కురిపించలేదా అన్నారు.

బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే బీఆర్ఎస్ నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్‌మన్‌ ఉద్యోగం ఎట్లా చేస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే బీజేపీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

దొంగలు అయితే ఎంపీ టిక్కెట్లు బీజేపీ ఎట్లా ఇస్తుందని ప్రశ్నించారు. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారని బీజేపీ ఆందోళనలు చేసిందని, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవడని విమర్శించారు.

సికింద్రాబాద్‌కు ఏం చేశారని కిషన్ రెడ్డి గెలుస్తారని, ఎమ్మెల్యేలు గెలువకపోయినా ఎంపీగా నేను గెలిస్తే చాలు అని కిషన్ రెడ్డి అనుకుంటున్నారన్నారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈటల అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. హుజూరాబాద్‌లోనే ఈటలను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడికి టిక్కెట్ ఇస్తే కుటుంబ రాజకీయం కాదా అని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపూరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని బీజేపీ టిక్కెట్ నిరాకరించిందని, గిరిజనుడైన బాపూరావును బీజేపీ అవమానించిందన్నారు.

వర్గీకరణ పేరుతో మోసం


ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తుందని శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఎంపీలకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలన్నారు.

తెలంగాణకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని, నాలుగు లిఫ్టులు తప్ప కిషన్ రెడ్డి చేసింది ఏం లేదన్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తప్ప ఏం రాలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 8 సీట్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.

ఇక ఆరు గ్యారెంటీలు అమలయ్యాయా అనేది సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏమైందన్నారు. రైతుబంధు ఇప్పటి వరకు పడలేదని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా అని ప్రశ్నించారు.

వరిపంటకు బోనస్ లేదని.. మహిళలకు 2,500 ఇస్తామని మాట తప్పారన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎట్లా అడుగుతుందన్నారు.

రైతుల పంటలు ఎండిపోవడానికి రేవంత్ రెడ్డి సర్కాణే కారణమని, గ్రామాల్లో కూడా కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు.

రేవంత్ రెడ్డి, బీజేపీ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, కాంగ్రెస్, బీజేపీలకు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని రావుల ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here