రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం

0
17
file

రేణుకాచౌదరి, అనిల్, వద్దిరాజుల ఎన్నిక
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. తెలంగాణ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్‌ వేయగా, వీరందరి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ లు నామినేషన్లు వేశారు.

వీరి నామినేషన్‌లో 10 మంది సంతకాలు లేకపోవడంతో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను తిరస్కరించారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మినహా మిగిలిన ముగ్గురికీ మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here