రాజూరికి ‘కీర్తి పురోహిత బ్రహ్మ’ పురస్కారం

0
27

ప్రజానావ/ముస్తాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణా చారికి వాస్తు జ్యోతిష్య రంగం లో గత 30 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ కీర్తి పురోహిత బ్రహ్మ పురస్కారాన్ని వరంగల్ లో అందజేశారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ జాతీయ పురస్కారాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ , బ్రహ్మశ్రీ వలబోజు మోహన్ రావు, డా.వంగాల శాంతి కృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here