అబద్ధాల కోరుకు తగిన శాస్తి

0
15

– ఢిల్లీ బీజీపీ ట్వీట్‌ వైరల్‌
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు బుధవారం నాడు పార్లమెంట్ ప్రాంగణంలో అనుకోని అనుభవం ఎదురైంది. ఇప్పుడు ఆ ఘటన సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. రాజకీయ వ్యతిరేకులు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. అసలు ఏమైందంటే రాఘవ్ చద్దా పార్లమెంట్ ప్రాంగణంలో ఫోన్ లో మాట్లాడుతూ వస్తుండగా అనూహ్యంగా ఓ కాకి ఆయన నెత్తిపై ముక్కుతో మొట్టికాయ వేసింది. అనుకోని సంఘటనకు రాఘవ్ చద్దా కంగుతిన్నారు. ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ‘అబద్ధాల కోరుకు తగిన శాస్తి’ అని క్యాప్షన్ తో ఢిల్లీ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది. ట్విట్టర్‌లో పెట్టిన కొద్దిసేపటికే ఈ ట్వీట్‌ వైరగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here