సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తమ ఇంట్లో ఉంటూ తమపైనే కేసు పెట్టారని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎడీ నౌహీరాషేక్ ఆరోపించారు.
బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఇంటిని అద్దెకు తీసుకున్న బండ్ల గణేశ్ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని తెలియడంతో అక్కడకి వెళ్లామని, ఇంతలోనే పోలీసులు వచ్చి మాపై కేసు పెట్టాని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు రాజకీయ నాయకులు తెలుసంటూ మా ముందు ఫోన్లు చేసి, మమ్మల్ని నమ్మించి ఇల్లు అద్దెకు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు సంతకాలు ఫోర్జరీ చేసి రూ.75కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులున్నా ఫిలీం నగర్ పోలీసులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.