UPPLA STADIUM | ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్‌

0
134
  • బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్‌ తొలగించిన విద్యుత్‌ అధికారులు
  • నెల క్రితమే నోటీసులు ఇచ్చినా స్పందించని క్రికెట్ బోర్డు
  • పాసులు ఇవ్వకపోవడంతోనే కట్‌ చేశారు: హెచ్‌సీఏ

ఉప్పల్‌, ప్రజానావ: గత కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్‌ స్టేడియానికి విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు.

శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌ రైసర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. కీలక మ్యాచ్ కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేయడంపై క్రికెట్‌ బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అయితే నెల క్రితమే బకాయిలను సంబంధించి నోటీసులు ఇచ్చినా బోర్డు స్పందించలేదని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ని సార్లు నోటీస్ పంపినా స్పందించలేదని తెలుస్తోంది.

చివరగా ఫిబ్రవరి 20న నోటిసు ఇచ్చినా బోర్డు నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ సామాన్యులకు, పెద్దలకు అందరికీ ఒకే రూల్‌ అంటూ కఠిన వైఖరి అవలంభిస్తోంది.

మరోవైపు తప్పని పరిస్థితుల్లో బకాయిలు రాబట్టడం కోసమే విద్యుత్ ను నిలిపి వేసినట్లు విద్యుత్‌శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే రేపటి మ్యాచ్‌కు విద్యుత్‌ శాఖ అడిగిన పాసులు ఇవ్వకపోవడంతోనే పవర్‌ కట్‌ చేశారని హెచ్‌సీఏ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here