వేములవాడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

0
14

భవానీ లాడ్జీలో పోలీసుల సోదాలు
– లాడ్జీ నిర్వాహకుడితో పాటు పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్టు
– రూ.86వేల నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం

ప్రజానావ/వేములవాడ: వేములవాడ పట్టణంలోని రిలయన్స్‌ మార్ట్‌ పక్కనగల భవానీ లాడ్జ్‌, హోటల్‌లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లాడ్జీ నిర్వాహకుడు అంజిరెడ్డితో పాటు పేకాట ఆడుతున్న మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, రూ.86వేల నగదు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో వేములవాడ టౌన్‌ ఎస్సై వెంకట్‌రాజం, రూరల్‌ ఎస్సై నాగరాజు, భాస్కర్‌, శ్రీకాంత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here