వైద్యుడి నిర్లక్ష్యం.. పసి ప్రాణం బలి!

0
1

– పుట్టిన మూడు రోజులకే కాటికి
– వైద్యుడి నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యుల రోధన
– ఫెనర్గాన్ టానిక్ వల్లే ప్రమాదమా..??

ప్రజానావ/వేములవాడ:

వైద్యో నారాయణ హరి అంటారు మన పూర్వీకులు.. దీని అర్థం వైద్యం చేసేవారు దేవుడితో సమానం అని… కానీ ఇక్కడ వైద్యులు మాత్రం ప్రాణం విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. పుట్టిన మూడు రోజులకే కాటికి పంపించారు.. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే పసిబాబు చనిపోయాడంటూ ఆ కుటుంబం అంతా ఆస్పత్రి ముందు రోదిస్తుంటే చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు.
వేములవాడ పట్టణంలో సోమవారం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన కడార్ల శివ స్వాతి లకు రెండో సంతానంలో భాగంగా డెలివరీ కోసం పట్టణంలోని పార్థసారథి ఆస్పత్రికి వచ్చారు. మూడు రోజుల క్రితం సిజేరియన్ డెలివరీ చేయగా బాబు జన్మించాడు. ఆ కుటుంబం చాలా సంతోషంలో ఉండిపోయారు. మూడు రోజులుగా ఆరోగ్యంగా ఉన్న బాబుకి సోమవారం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయంటూ వైద్యుడు శ్రీనివాస్ కరీంనగర్ కు రెఫర్ చేశారు. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లగా మార్గమధ్యలోనే పసిబాలుడి మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నారి బాలుడు వైద్యం వికటించడం వల్లే మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల పసి బాలుడికి ఫెనర్గాన్ టానిక్ వంటి అతి తీవ్ర ప్రభావం కలిగిన మందులు ఇచ్చారని వారు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఇవ్వకూడని మందులు శిశువుకు ఇవ్వడమే మరణానికి కారణమంటూ తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శిశువుకు వైద్యం అందించడంలో తమ తప్పేమీ లేదని, పుట్టినప్పటి నుండి బాబు పరిస్థితి బాగానే ఉందని, సోమవారం ఉదయం అకస్మాత్తుగా బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే విషయాన్ని గమనించి కరీంనగర్ కు వెళ్లాలని సూచించమని డాక్టర్ శ్రీనివాస్ సమాధానమిచ్చారు.

మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం 
చిన్నారి బాలుడి మృతి పట్ల బాధిత కుటుంబ సభ్యులతో ఆస్పత్రి యాజమాన్యం బేరసారాలు చేసింది.
తమ తప్పిదం వల్లే శిశువు మృతి చెందాడని, అందుకే ఆసుపత్రి నిర్వాహకులు బాధ్యత వహిస్తూ ఈ రాజీ బేరాన్ని కుదుర్చకున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here