Payal rajput: పాయల్‌ను అలా బెదిరించారా?

0
398

తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని మూవీ మేకర్స్‌ బెదిరిస్తున్నారని నటి పాయల్‌ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అసలేమైందంటే.. ‘2019-20 మధ్య కాలంలో ‘రక్షణ’ సినిమాను అంగీకరించా.

అప్పడు ఆ టైటిల్‌ పేరు 5WS. సినిమా పూర్తియినా ఇప్పటివరకు విడుదల చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. అప్పుడ నేను మాట్లాడుకున్న రెమ్యూనరేషన్‌ సైతం ఇప్పటివరకు ఇవ్వలేదు.

పైగా ప్రమోషన్లకు రావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్‌లో ప్రమోషన్లకు రాలేనని నేను, నా టీమ్‌ చెప్పినా వినకుండా బెదిరిస్తున్నారని వాపోయారు.

అంతేకాకుండా తనను తెలుగు ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాం’ అని దుర్భాషలాడుతున్నారని పేర్కొన్నారు. నా రెమ్యూనరేషన్‌ ఇస్తే డిజటల్‌ ప్రమోషన్స్‌కు వస్తానని చెప్పినా వినడం లేదని పాయల్‌ వాపోయారు.

ఇటీవల నేను చేసిన సినిమాలు విజయం సాధించడంతో ఆ సక్సెస్‌ను వాడుకునేందుకే వారు ఇలా నాపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని పాయల్‌ ఇన్‌స్టాలో చేసిన పోస్టులో వివరించారు. ఇక దీనిపై పాయల్‌ అభిమానులతో పాటు పలువురు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here