వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

0
14

– వేములవాడ ట్రాఫిక్ ఎస్సై దిలీప్ కుమార్
– శ్రీ చైతన్య విద్యార్థులచే ఫ్లాష్ మాబ్

ప్రజానావ/వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ముందు గురువారం పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పై శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులచే ఫ్లాష్ మాబ్ నిర్వహించగా, విద్యార్థుల నృత్యాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్

ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ, నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయరాదని, రోడ్డు నిబంధనలు పాటించి, ప్రాణాలను రక్షించుకోవాలని, మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సుదేశ్ కుమారి, సిబ్బంది సుధీర్, సుధాకర్,
ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here