అమెరికా పర్యటనకు మోదీ

0
11

– న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలకు హాజరు
– ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో సమావేశం
– అక్కడి నుంచి ఈజిప్ట్‌కు పయనం
భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. భారత కాలమాన ప్రకారం ఈ రాత్రికి మోదీ న్యూయార్క్‌ చేరుకుంటారు. అంతకుముందు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతారు.

అనంతరం అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తోనూ సమావేశమవుతారు. అలాగే వాషింగ్టన్‌ డీసీలో జరిగే యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలను కలవనున్నారు. పలు సమావేశాల్లో భారత సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి ఈజిప్ట్‌ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here