– వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
తెలంగాణ ఉద్యమంలో మిద్దె రాములు పాత్ర ఎనలేనిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మిద్దె రాములు జయంతి సందర్భంగా వారి నివాసంలో నివాళులర్పించి మాట్లాడారు. మిద్దె రాములు గొప్ప కళాకారులు అని, ఈ ప్రాంతంలో డా.సి.నారాయణ రెడ్డి అంతటి గొప్ప వ్యక్తులతో సమానంగా మన మిద్దె రాములు ఉంటారన్నారు. రానున్న కాలంలో రూ.10కోట్లతో సీనారే కళాభావన్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించబోతున్నామని, దీనివలన ఇక్కడి కళాకారులకు నిత్యం సాధన చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. మిద్దె రాములు కుటుంబ సభ్యులు కూడా గొప్ప కళాకారులు కావడం సంతోషించాల్సిన విషయమన్నారు. మిద్దె రాములు జానపద రంగానికి ఎనలేని కృషి చేసి, ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయారని, అలంటి మహానుభావుడు మా అందరి గుండెల్లో ఎప్పుడు ఉంటారు అని ఆయన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్, జోగిని శంకర్, పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.