11062 పోస్టులతో మెగా డీఎస్సీ

0
48

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

mega dsc 2024: 11062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం విడుదల చేశారు. డీఎస్సీ 2023లో 5089 పోస్టుల కే నోటిఫికేషన్పా ఇవ్వగా, గత నోటిఫికేషన్ రద్దు చేసి, అప్పటి కంటే డబుల్ పోస్టుల తో కొత్త నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు.

మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉండగా, గతంలో ఉన్నట్టుగానే దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి ఉంది.

18 ఏండ్ల నుంచి 46 ఏండ్లలోపు అభ్యర్థులు డీఎస్పీ 2024 పోస్టులకు అర్హులు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మొత్తం11 కేంద్రాల్లో ఆన్ లైనలో పరీక్షలు నిర్వహణ ఉండనుంది. త్వరలోనే ఈ పరీక్షా తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

పాత పోస్టులకు అదనంగా 4957 జనరల్ టీచర్ పోస్టులు, 1016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here