హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌పై పిడుగు

0
9

– భయాందోనలో ప్రజలు.. 27వరకు భారీ వర్షాలే
– పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

ప్రజానావ/హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా పిడుగుపాటుకు లిఫ్ట్‌తో పాటు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు కాలిపోయినట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో ఈ నెల 27వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఊరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తుండడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రజలను హెచ్చరించింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పలు ఏరియాల్లో నాలాలు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లగా, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here