చలో పోదాం సర్కారు దవాఖానాకు..

0
14

– స్వరాష్ట్రంలో వైద్యరంగానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
ప్రజానావ/సిరిసిల్ల: ‘సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపం అన్నట్లు ఉండేది. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపు వచ్చింది. నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆసుపత్రికెళితే ఒక ధైర్యం, భరోసాను ప్రభుత్వం ఇచ్చింది. కేసీఅర్ కిట్ల నుంచి.. న్యూట్రిషన్ కిట్ల దాకా.. డయాలసిస్ సెంటర్ల నుంచి.. డయాగ్నోస్టిక్ కేంద్రాల వరకు.. పల్లె, బస్తీ దవాఖానా నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం తెలంగాణ వైద్యారోగ్య రంగ ప్రస్థానంలో విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యింది. ఫలితంగా ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అనే దశాబ్దాల దుస్థితి నుంచి.. “చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనేలా రోగులకు తెలంగాణ సర్కార్ ధీమా ఇచ్చింది. మాతా శిశు మరణాల రేటును భారీగా తగ్గించడం ప్రభుత్వం సాధించిన మానవీయ విజయం. జిల్లాలో ఇప్పటి వరకూ 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ ఎన్ క్వాస్ లభించడం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. జిల్లా, ఏరియా ఆసుపత్రులలో గర్భిణులకు సహాయకారిగా ఉండేందుకు మాతృ సేవా కార్యక్రమం ప్రారంభించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 70 శాతం పెంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు’ అంటూ సిరిసిల్ల జిల్లాలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఇప్పటివరకు 18 వేల 211 మంది బాలింతలకు కె.సి.ఆర్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది. గర్భవతులు, బాలింతలకు వారి ఖాతాలో 19 కోట్ల 76 లక్షల 83 వేల రూపాయలు కే‌సి‌ఆర్ కిట్ లో భాగంగా జమ చేయడం జరిగింది. జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు 47 శాతం నుండి 70 శాతంకు పెరిగాయి.
వృద్ధులకు బాసటగా డే కేర్ సెంటర్
మలిసంధ్యలో ఉన్న వృద్ధులు ఆత్మగౌరవంతో బ్రతికేలా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం (డే కేర్ సెంటర్) ను ఏర్పాటు చేశాం. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన వృద్ధాశ్రమం ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here