ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

0
17

ప్రజానావ/వేములవాడ రూరల్‌: సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు రాష్ట్రాన్ని.. ఇటు జిల్లాను మంత్రి కేటీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారని, ఈరోజు ఐటీలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం యువత బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పట్టణాలకు వలస వెళ్లేవారని, కానీ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఈ తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధికి మిగతా రాష్ట్రాల్లోని ఉపాధి కోసం ఇక్కడికి వలసలు వస్తున్నాయని గుర్తుచేశారు.

కేటీఆర్‌ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తంపుల సుమన్ గ్రామ శాఖ అధ్యక్షుడు కచ్చు పరశురాములు, జిల్లా వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు చేట్టిపల్లి నరేశ్‌, నాయకులు సంజీవ్, జంగం చంద్రమౌళి, కోరే తిరుపతి, నాగరాజు, అంజి, కొమురయ్య, ముత్తయ్య, అంజయ్య పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here