బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వికారాబాద్, ప్రజానావ: ‘రేవంత్ రెడ్డి (Revanth Reddy).. నీ ఫేవరేట్ డైలాగ్ ఉంది కదా.. నువ్వు మొగోడివి అయితే గెలువు అన్నావు కదా. నేను అదే అడుగుతున్నా రేవంత్.. నువ్వు మొగోడివి అయితే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ రూ.2లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలందరికీ రూ.2500 ఇచ్చి చూపెట్టు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
బుధవారం చేవేళ్ల పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశాన్ని వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వృద్ధులకు రూ.4వేల పింఛన్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదాతో పాటు 24 గంటల కరెంటు ఇచ్చే దమ్ముందా అన్నారు.
హామీలను అమలు చేయలేకనే ఎప్పుడూ బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మేం ఇచ్చిన హామీలు అమలు చేయకున్నా మమ్మల్నే గెలిపించారు అంటారని ప్రజలు హెచ్చరించారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని కోరారు.