హాస్టల్‌ ఫీజ్‌ అడిగితే రేప్‌ కేసు పెడతా

0
200

ఫీజు అడిగితే రేపు కేసు పెడతానంటూ ఓ మహిళా హాస్టల్‌ యజమానిని బెదిరించిన ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నయీమా సుల్తానా అనే మహిళా కాచిగూడ పరిధిలోని ఓ హాస్టల్‌ ఉంటుంది. హాస్టల్‌ ఫీజు కట్టకపోవడంతో యజమాని ఫీజు చెల్లించాలంటూ అడిగాడు.

తను హాస్టల్‌ ఫీజు అడిగితే రేప్‌ కేసు పెడతానని, రూ.50వేలు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తానని ఈ కిలాడీ లేడి ఒక్కసారిగా బెదిరింపులకు దిగింది. చేసేదిలేక నయీమాపై హాస్టల్‌ యజమాని కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నయీమా సుల్తానాను అరెస్టు చేశారు. ఇదిలాఉంటే ఈ కిలాడీ లేడీ ఇప్పటికే 18కిపైగా కేసులు ఉండడం విశేషం.

గతంలోనూ జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద అమాయకులను లిఫ్ట్‌ అడిగి, కొంచెం దూరం వెళ్లిన తర్వాత బట్టలు చింపుకొని మీపై రేప్‌ కేసు పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసింది.

ఇలా ద్విచక్రవాహనదారులు, కారు డ్రైవర్లను మోసం చేసి గతంలోనూ అరెస్టయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here