కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాల్సిందే

0
18

– అందుకు నేను హోంమంత్రి కావాల్సిందే
– కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య

ప్రజానావ/హైదరాబాద్‌ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తాను హోం మంత్రిని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. శాసనసభ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చా. నేను హోంమంత్రి అయితేనే బీఆర్‌ఎస్‌ నేతలు కంట్రోల్‌లో ఉంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు, జగదీశ్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో మా కుటుంబసభ్యులెవరూ పోటీ చేయకూడదనేది మా ఆలోచన.

పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తాం అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్ మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. మీలానే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీకూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు. దయచేసి తనను కాంట్రవర్సీలోకి లాగవద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక అనంతరం అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో కాసేపు చిట్ చాట్ చేశారు. కేసీఆరే దగ్గరుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారన్నారు. వాళ్లను వాళ్లు కాపాడుకోడానికి బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీలో చేరుతారన్నారు. తనకు హోం మంత్రి కావాలని ఉందని.. బీఆర్‌ఎస్ వాళ్లను జైలుకు పంపాలని కోరికగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here