బీజేపీలో చేరికలు

0
22

మేడ్చల్‌ జిల్లా గాజులరామారం డివిజన్ పరిధి కైసర్ నగర్, హెచ్ఎఎల్ కాలనీల్లో వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది నాయకులు, యువకులు, మహిళలు ఆదివారం గాజులరామారంలోని బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగొందారని, ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో హరి కిషోర్, కిషోర్, చిన్నయ స్వామి, దివాకర్ ఘోష్, సువర్ణ, సల్మా భేగం, హేమశ్రీ, అనిత, ప్రశాంత్, అర్జిత్ పాండే, రమా పాండే, సుదీర్ యాదవ్, జయదీప్ రెడ్డి, సాంబయ్య, అజయ్, సాయి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బావిగడ్డ రవి, డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బిజెవైఎం సాయిరాం రెడ్డి, డివిజన్ నాయకులు శ్రీనివాస్ రావు గోపాల్, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here