ఘనంగా జయశంకర్‌ సార్‌ జయంత్యుత్సవాలు

0
17

ప్రజానావ/వేములవాడ రూరల్‌: తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ 89వ జయంత్యుత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ చీర్లవంచ గ్రామంలో జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్‌ సార్‌ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోగిలోజు సత్తయ్య, వెంకటేశ్‌, సంతోష్, వేణు, నవీన్, రవి, ప్రశాంత్, కోగిలంచ శ్రీను, రాజేందర్‌ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here