ఫైనల్‌లోనూ ఇలాగే ఆడాలి

0
24

– హైద‌రాబాద్ రంజీ జ‌ట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అభినంద‌నలు

రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో ఫైన‌ల్ చేరిన హైద‌రాబాద్ జ‌ట్టును హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు అభినందించారు. ఆదివారం నాగాలాండ్‌తో ముగిసిన సెమీస్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఇన్నింగ్స్ 68 ప‌రుగుల‌తో విజయం సాధించింది. ఈ సందర్భంగా జట్టును అభినందించిన జగన్‌ మోహన్‌రావు మాట్లాడుతూ ఈనెల 17 నుంచి జ‌ర‌గ‌నున్న‌ ఫైన‌ల్‌ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడాల‌న్నారు.

మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ తిలక్‌ వర్మతో ఫోన్‌లో మాట్లాడిన జగన్‌మోహన్‌ రావు సెంచ‌రీ సాధించినందుకు, టీమ్‌ను విజ‌యాల దిశ‌గా న‌డిపిస్తున్నందుకు అభినందించారు. అలాగే సెంచ‌రీ హీరో త‌న్మ‌య్ అగ‌ర్వాల్‌, 13 వికెట్లు తీసి స‌త్తా చాటిన తనయ్‌ త్యాగరాజన్‌ను కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహ‌న్ రావు ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here