ఐటీ హబ్‌ అంటే బిల్డింగ్‌ కాదు..

0
10

‘ఐటీ హబ్‌ అంటే బిల్డింగ్‌ కాదు.. యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబం’ అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో జిల్లాలో పర్యటించి ఐటీ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడే ఎక్కేందుకు ఐటీ హబ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా, మీరే ఇతరులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. రాజకీయాలు ఎప్పుడుంటాయని, యువత తల్లిదండ్రులు గర్వపడేలా అవకాశాలను సద్దినియోగించుకొని ముందుకెళ్లాలని సూచించారు. నిజామాబాద్‌లో రూ.50కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్‌, డిప్లొమా చదివిన 1400 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here