కార్మికులకు లేబర్‌ కార్డుల అందజేత

0
2

ప్రజానావ/ సికింద్రాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డ్ వాల్మీకి నగర్, మహాత్మా గాంధీ నగర్ కు చెందిన 20 మంది కి సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ చేతులమీదుగా లేబర్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని తెలియజేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు, కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కార్మికులకు అందజేయడమే ధ్యేయంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ సత్యనారాయణ, యాదగిరి, లింగం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here