నిజంగానే ఆ మసీదులో శివలింగం ఉందా?

0
15

– మసీదు నిర్వహణ కమిటీ సర్వేను ఎందుకు బాయ్‌కాట్‌ చేసింది?
GYANVAPI : లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లో నిజంగానే శివలింగం ఉందా? హిందూ దేవాలయంపై మసీదు నిర్మించింది నిజమేనా? ఇవేవీ నిజం కాకపోతే మసీదు నిర్వహణ కమిటీ సర్వేను ఎందుకు బాయ్‌కాటే చేస్తోంది? భారత పురావస్తు శాఖ టీమ్ సోమవారం శాస్త్రీయ సర్వే మొదలుపెట్టింది.

ఉదయం ఏడు గంటలకే ఏఎస్ఐ టీమ్ మసీదుకు చేరుకుని ఆ ఏరియాను మొత్తం సీల్ చేశారు. ఊజుఖానా మిగతా ప్రాంతానంతా తమ పరిధిలోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే మసీదు నిర్వహణ కమిటీ ఈ సర్వేను పూర్తిగా బాయ్ కాట్ చేసింది. కమిటీలోని ఏ ఒక్క సభ్యులూ సర్వేకు హాజరుకాలేదని మజీదు కమిటీ జాయింట్ సెక్రెటరీ సయ్యద్ మహ్మద్ తెలిపారు. ఏఎస్ఐ తన నివేదికను వచ్చే నెల 4నాటికి వారణాసి జిల్లా న్యాయస్థానికి సమర్పించనుంది.

గత శుక్రవారం నాడు కోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ శాస్ర్తీయ సర్వే ప్రారంభమైంది. పురాతన హిందూ దేవాలయంపై మసీదు నిర్మించారని, అందులో శివలింగం ఉందని, తమకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని నలుగురు మహిళా భక్తులు వేసిన పిటిషన్ మేరకు వారణాసి కోర్టు నిజాలు నిగ్గు తేల్చేందుకు శాస్త్రీయ సర్వేకు ఆదేశించింది. దాని ప్రకారం సోమవారం నాడు సర్వే మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికంగా భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here