– డక్‌వర్త్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయం
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 139 పరుగులు చేసింది. బారీ మెక్‌కార్తీ (51, నాటౌట్), కర్టీస్ కాంఫర్ (39) రాణించారు. టీమిండియా బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్, బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత జట్టు 6.5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 47 పరుగులు చేసింది. ఈక్రమంలో వర్షం పడడంతో ఎంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా గెలుచుకున్నాడు.