ipl celebrations: ఆరంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు

0
23
source: ipl twitter

ఐపీఎల్ సీజన్ 2024 ఆరంభవేడుకలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం చెపాక్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో స్టేడియం వెలిగిపోతోంది. ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లు అలరించనున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ తదితరులు ఆటపాటలతో సందడి చేయనున్నారు. శుక్రవారం సాయంత్ర 6.30 గంటల నుంచి ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్‌లో ప్రారంభోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లోనూ లైవ్‌స్ట్రీమింగ్ ఉంటుంది.

కాగా, శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నైబెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్17 తెరలేస్తోంది. ఐపీఎల్ తొలి దశలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు భారత్‌లో జరుగుతుంది.

ఐపీఎల్ విజేతకు రూ.20 కోట్లు
ఐపీఎల్‌లో ట్రోఫీని సాధించే జట్టుకు భారీ నగదు నజరానా లభించనుంది. ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్‌లో లేనంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ ఐపీఎల్ ఛాంపియన్‌గా లభిస్తోంది.

ఈసారి ట్రోఫీని సాధించే జట్టుకు రూ. 20 కోట్ల నగదు నజరానాను అందజేస్తారు. కిందటిసారి విజేతగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా రూ. 20 కోట్ల నగదు బహుమతిని అందుకుంది.

ఈసారి కూడా విజేతగా నిలిచే టీమ్‌కు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్లు దక్కుతాయి.

ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ.ఆరు కోట్ల నగదు బహుమతిని అందజేశారు.

ప్రపంచంలో జరిగే ఇతర క్రికెట్ లీగ్‌లతో పోల్చితే ఐపిఎల్‌లోనే భారీ మొత్తంలో నగదు బహుమతి లభిస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ విజేతకు రూ.4.15 కోట్లు మాత్రమే లభిస్తాయి.

ఐపీఎల్ తర్వాత అంతటి ఆదరణ కలిగిన ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ విజేతకు రూ.3.66 కోట్ల నగదు బహుమతి మాత్రమే ఇస్తారు.

కాగా, ఐపీఎల్ తర్వాత అత్యధిక ప్రైజ్‌మనీ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో లభిస్తోంది. సౌతాఫ్రికా లీగ్‌లో విజేత టీమ్‌కు రూ.15 కోట్లు బహుమతిగా అందజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here