అభివృద్ది పనుల పరిశీలన

0
15

కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుదవారం డివిజన్ కార్పొరేటర్ జెర్రీపోతుల ప్రభుదాస్ అధికారులతో కలిసి పరిశీలించారు.కృష్ణానగర్ కాలనీలో రోడ్ నెంబర్ 4లో జరుగుతున్న సి సి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. జల మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నూతన మంచినీటి పైప్ లైన్ పనులను జలమండలి అధికారి వేణు గోపాల్ తో కలసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కాలని వాసులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పరిష్కారామే మార్గంగా ముందుకు పోతూ, డివిజన్ అభివృద్ధికీ నావంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జల మండలి, అధికారులు, సిబ్బంది, కృష్ణానగర్ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దండెం నరేందర్, నిసార్ అహ్మద్ గోరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here