water problems: తాగునీటి సమస్యలుంటే సమాచారమివ్వండి

0
90

సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి


సిరిసిల్ల, ప్రజానావ:
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీరు సమస్య ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 9398684240కు కాల్ చేయాలని సూచించారు. వారు సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here